తోర్రుర్ డివిజన్ విద్యుత్ డిఈగా కృష్ణ బాధ్యతలు
కాకతీయ, పెద్దవంగర /తోర్రుర్ : విద్యుత్ శాఖ మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ డివిజన్ డిఈ గా కృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో పాటు లో వోల్టేజీ నివారణ లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు.అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ సభ్యురాలు యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తొర్రూరు డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా, ప్రజలకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యల పరిష్కారం, విద్యుత్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులను సమర్థవంతంగా చేపట్టాలని ఆమె సూచించారు.ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.

