కమలాపురం శివారులో దారుణ హత్య
గుర్తుతెలియని వ్యక్తుల గొడ్డళ్ల దాడి
గ్రామంలో కలకలం
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం శివారులో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
హత్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? బాధితుడిపై ఎందుకు దాడి చేశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

