చదువుకు సైకిల్ ఆసరా
మానాల విద్యార్థులకు 12 సైకిళ్ల అందజేత
దూర ప్రాంత విద్యార్థులకు రాకపోకల ఇబ్బందులు లేకుండా
విద్యాభ్యాసానికి తోడ్పాటుగా సేవా కార్యక్రమం
విలియన్ భాస్కర్ సౌజన్యం
కాకతీయ, రుద్రంగి : దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించే విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి ఆర్మూర్‌కు చెందిన విలియన్ భాస్కర్ 12 సైకిళ్లు అందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విలియన్ భాస్కర్ సౌజన్యంతో సైకిళ్లను అందించారు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా ఇబ్బందులు తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువుకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు అవసరమైన సహాయాన్ని అందించడమే లక్ష్యంగా భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు. విద్యాభ్యాసానికి చిన్న సహాయం కూడా పెద్ద ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, యంఈవో రామకృష్ణ, వార్డు సభ్యుడు లక్కాకుల రమేష్, వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, రిటైర్డ్ ఏడీఈ లక్ష్మణ్ నాయక్, రుప్లా తండా సర్పంచ్ జవహర్‌లాల్ నాయక్, విడీసీ చైర్మన్ మహేష్, మదన్, తుమ్ జలపతి, లక్కాకుల శ్రీనివాస్,పిసరి రవీందర్, నాంచారి రాకేష్, కోక్కుల వంశీ, కోల నరేందర్, చెదలు నవీన్, పాల గణేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

