epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

23,757 జీడీఎస్ పోస్టుల‌తో నోటిఫికేష‌న్‌

23,757 జీడీఎస్ పోస్టుల‌తో నోటిఫికేష‌న్‌
నేటి నుంచే వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌
తెలంగాణ, ఏపీలోనూ భారీగా పోస్టులు
సెప్టెంబర్‌ 2 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు
10వ తరగతి అర్హత..! రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక
పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌

కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్‌ శుభవార్త అందించింది. తపాలా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ డాక్‌ సేవక్‌ రిక్రూట్‌మెంట్‌–2026కు సంబంధించి వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 23,757 జీడీఎస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ గణనీయ సంఖ్యలో పోస్టులు ఉన్నట్లు వెల్లడించారు. ఇండియా పోస్ట్‌ అధికారిక జీడీఎస్ పోర్టల్‌లో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 19, 2026 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రక్రియ సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్‌ 21, 2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో ఎడిట్‌/కరెక్షన్‌ విండో అందుబాటులో ఉంటుంది.

పదో తరగతి అర్హత ఉంటే చాలు..

జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌లో పాస్‌ మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేస్తున్న పోస్టుకు సంబంధించిన స్థానిక భాషను కనీసం పదో తరగతి వరకు చదివి ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ట్రాన్స్‌వుమెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఫీజును క్రెడిట్‌/డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకపోవడం. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సిస్టమ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. దాని ఆధారంగానే అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. మెరిట్‌ లిస్ట్‌ తయారీలో మార్కులను 4 డెసిమల్‌ పాయింట్ల వరకు పరిగణనలోకి తీసుకుంటారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.