epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి
మారుమూల గూడాల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం
మామిడిగూడెం, కొమరం భీమ్‌నగర్‌లో పాఠశాలలు ప్రారంభం
గిరిజన చిన్నారుల ప్రతిభను ప్రశంసించిన మంత్రి సీతక్క
మామిడిగూడెంలో మౌలిక వసతుల కల్పనకు హామీ
సహజత్వాన్ని కాపాడుతూ మల్లూరు ఆలయ అభివృద్ధి
మాస్టర్‌ప్లాన్‌తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు
రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

కాకతీయ, ఏటూరునాగారం : మారుమూల గిరిజన గూడాల్లోని చిన్నారులకు విద్యను చేరువ చేసి నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో సింగరేణి కాలరీస్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను, కొమరం భీమ్‌నగర్‌ కాలనీలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.5 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి మంత్రి సీత‌క్క ప్రారంభించారు. పాఠశాలలు, రహదారులు, విద్యుత్‌ సౌకర్యాలు లేని అటవీ ప్రాంతాల్లోనూ విద్యకు ఆటంకం లేకుండా అవసరమైన చోట కంటైనర్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మామిడిగూడెం గుత్తికోయ గూడెంలోని విద్యార్థులు పరిమిత సౌకర్యాల మధ్య తెలుగు, ఆంగ్ల భాషల్లో పాటలు, కథలు, సంభాషణలతో చూపిన ప్రతిభను మంత్రి అభినందించారు. పట్టణ విద్యార్థులకు దీటుగా గిరిజన చిన్నారులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ఇర్ప మధు, సారంగం సేవలను ప్రశంసించారు. పట్టుదల కలిగిన గురువు విద్యార్థుల జీవితాలను మార్చగలరని, ఉన్నత శిఖరాలకు చేర్చగలరని పేర్కొన్నారు.

మామిడిగూడెంలో మౌలిక వసతులకు హామీ

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతోపాటు పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూరుస్తామని మంత్రి సీతక్క తెలిపారు. జిల్లాలో విద్యావ్యవస్థ బలోపేతానికి పాఠశాలలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌, డీఈవో, విద్యాశాఖ అధికారుల కృషిని అభినందించారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి చదువుకు సహకరించాలని కోరారు. మామిడిగూడెంలో త్వరలో బోరు మంజూరు చేసి తాగునీరు, సౌర విద్యుత్‌ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. మంజూరైన రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు పొందేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అటవీశాఖ సహకారంతో అంబులెన్సులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించేలా మార్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి సౌకర్యాలను తెలుసుకున్న మంత్రి.. కలెక్టర్‌తో కలిసి వారికి ఏకరూప దుస్తులు, బూట్లు పంపిణీ చేసి, చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు.

సహజత్వాన్ని కాపాడుతూ మల్లూరు ఆలయ అభివృద్ధి

విద్యతోపాటు మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం మల్లూరు ఆలయ అభివృద్ధిలోనూ సహజ వాతావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షిస్తూ క్షేత్ర విశిష్టత ప్రతిబింబించేలా సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని సూచించారు. కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీత‌క్క‌ అనంతరం ఆలయ అభివృద్ధిపై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు. దట్టమైన అడవులు, వందల ఏళ్ల నాటి వృక్షాలు, సహజ జలవనరులతో కూడిన మల్లూరు ప్రకృతి సంపదకు ఎలాంటి విఘాతం కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి ప్రదేశాలు, పార్కింగ్‌, రాకపోకల మార్గాలు, వసతి గదులు, కల్యాణ మండపం వంటి సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆలయ చరిత్ర, పురాణ నేపథ్యం, స్వామివారి విశిష్టత ప్రతిబింబించేలా శిల్పాలు, విగ్రహాలతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి మల్లూరును ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ మండపం విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న గోశాలకు కలెక్టర్‌తో కలిసి భూమిపూజ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోడ్డుపై బిల్డింగ్ నిర్మాణం

రోడ్డుపై బిల్డింగ్ నిర్మాణం రోడ్డును క‌బ్జా చేస్తూ క‌న్‌స్ట్రక్ష‌న్‌ అక్రమ నిర్మాణంపై చూసి చూడ‌న‌ట్లుగా...

సాయి వర్షిణికి సీపీ శ్వేత‌ అభినందనలు

సాయి వర్షిణికి సీపీ శ్వేత‌ అభినందనలు సాఫ్ట్‌బాల్ అండర్‌-15 ఆసియా కప్‌లో దేశం...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి వర్షంలో నిమజ్జన ఏర్పాట్లపై సీపీ, కమిషనర్ ప్రత్యేక...

నిండు కుండలా చెరువులు

నిండు కుండలా చెరువులు పరవళ్లు తొక్కుతున్న మత్తళ్లు కాకతీయ, పెద్దవంగర : ఎడ‌తెర‌పి లేకుండా...

స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన

స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన కాకతీయ,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి లోని బాలికల గురుకుల...

నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్త‌వం

నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్త‌వం బడి తండా సర్పంచి ధనమ్మ అమ్రూ నాయక్ కాకతీయ,నెల్లికుదురు...

నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు

నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు 27 నుంచి స్వామివారి మండల దీక్షలు...

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం జై భవాని కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.