రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో మొగులోజు రాకేష్
కాకతీయ, కరీంనగర్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల్లో పంచాయతీ కార్యదర్శి మొగులోజు రాకేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సేవా దృక్పథంతో సమాజానికి మరింత విస్తృతంగా సేవలందించేందుకే ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగుల గళాన్ని జిల్లా స్థాయి సేవా వేదికపై వినిపించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. తోటి ఉద్యోగుల సహకారం, ఉద్యోగ సంఘాల ప్రోత్సాహం తనపై బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. నామినేషన్ సందర్భంగా మార్గదర్శనం, ఆశీస్సులు అందించిన జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎంపీడీవోలు, ఎంపీఓలకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్ లైఫ్ మెంబర్షిప్ కలిగిన ఉద్యోగులు, సభ్యులు, శ్రేయోభిలాషులు తనకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్జీవో కరీంనగర్ కార్యదర్శి సంగం లక్ష్మణరావు, రెడ్‌క్రాస్ మాజీ చైర్మన్ కేశవరెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోదారి అజయ్ తదితరులు పాల్గొని రాకేష్‌కు మద్దతు ప్రకటించారు.

