రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత
గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్ సేవాభావం
కాకతీయ, గీసుకొండ: మండల సర్వసభ్య సమావేశంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్ తన సొంత నిధులతో ఎంపీడీవో కార్యాలయానికి కప్పులు, సాసర్లు అందజేశారు. ఇటీవల నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో కార్యాలయ అవసరాల కోసం సామగ్రి అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.10 వేల సొంత ఖర్చుతో 100 కప్పులు, సాసర్లు కొనుగోలు చేసి సోమవారం గీసుకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఇన్చార్జి ఎంపీడీవో అసూరి మారిన్గంటి వెంకట కమలాకర్‌కు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సొంత నిధులతో సామగ్రిని అందజేసిన సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్‌కు మండల పరిషత్ అధికారులు, సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శత్రుజ్ఞరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కొండల్‌రెడ్డి, పంచాయతీ ఆపరేటర్లు వేల్పుల సురేష్‌యాదవ్, రఘుసాల రాజేష్, కారోబార్ ఎం.డి. అలీ తదితరులు పాల్గొన్నారు.

