epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం
కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాలి
దసరా నాటికి ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫారాలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

కాకతీయ, వరంగల్‌ బ్యూరో : రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కలెక్టర్లు రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహారం నాణ్యత, పారిశుధ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులను పరిశీలించాలని సూచించారు. ఫుడ్‌ పాయిజనింగ్‌, ఎలుకలు, పాముకాటు వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఆహార పదార్థాల తయారీ, నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. విద్యాసంస్థల పరిస్థితులను పర్యవేక్షించే డ్యాష్‌బోర్డ్‌ను కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలించి, సౌకర్యాలు, లోపాలు, పరిష్కార చర్యలను ఇంటిగ్రేటెడ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వేడి నీరు, దుప్పట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె భవనాల యజమానులతో సమావేశమై అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు. దసరా నాటికి ప్రతి విద్యార్థికి 2 జతల కుట్టిన యూనిఫారాలు అందేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

హాస్టళ్లలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి అధికారులతో మాట్లాడుతూ అక్టోబర్‌ 1 నుంచి 15 వరకు అన్ని సంక్షేమ హాస్టళ్లలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. బుష్‌ క్లియరెన్స్‌ చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అధికారులు ప్రతి హాస్టల్‌ను సందర్శించి మౌలిక వసతులు, మెనూ ప్రకారం భోజనం అందుతున్న తీరును పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌, జడ్పీ సీఈవో శేషాద్రి, ట్రైనీ కలెక్టర్‌ రోహిత్‌ నేత, డీఈఓ గిరిరాజ్‌ గౌడ్‌, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు

నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి జీడబ్ల్యూఎంసీ...

16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత

16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత సొంత నిధులతో రూ.10...

రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత

రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత గీసుకొండ సర్పంచ్‌ వీరగోని రాజ్‌కుమార్‌...

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా?

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా? ఆక్రమణలు తొలగించకుండానే రోడ్డు నిర్మాణానికి అధికారుల హడావుడి కమిషనర్‌ క్షేత్రస్థాయిలో...

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం...

జనసభలోనే నా పోరాటం

జనసభలోనే నా పోరాటం కేసీఆర్‌ మాటలే స్ఫూర్తిగా.. ప్రజల మధ్యే నా ప్రయాణం పట్టభద్రుల...

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి ఆక్రమణలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి ప్రభుత్వ...

ఆలస్యమైనా అదిరిపోయింది

ఆలస్యమైనా అదిరిపోయింది కొత్త యూనిఫామ్‌లతో విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం దుస్తులతోపాటు బూట్లు, బెల్టుల పంపిణీ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.