తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు
మద్యం మత్తులో తల్లిని కొడుతున్నాడని ఘాతుకం
కర్రతో దాడి చేయడంతో లక్కుమల్ల వెంకన్న మృతి
కాకతీయ, కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామంలో తండ్రిని కొడుకు కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కుమల్ల వెంకన్న (56) మద్యం మత్తులో తరచూ తన తల్లిని కొడుతున్నాడని, దీంతో ఆయన కుమారుడు సునీల్ కర్రతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకన్న మృతి చెందాడు. ఘటనపై కురవి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

