సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి పిలుపు
కాకతీయ, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు, గ్రామాల వారీగా ప్రజలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించడం, పార్టీ శ్రేణుల సమన్వయంపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగి సభను జయప్రదం చేయాలని కోరారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య, నాయకులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, గట్ల మీనయ్య, అక్కెనపెళ్లి శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, తర్రె మనోహర్, సనుగుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

