ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
కాకతీయ,శంకరపట్నం: మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా వీరుడు, ముదిరాజ్ సమాజ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పోలవేణి బిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న సేవలను, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు గూళ్ల రాజు, గరిగే కోటి, ప్రభాకర్, సర్పంచులు గోదారి రాజేంద్రప్రసాద్, పూదరి రాజు, నేదురు పవన్, కొయ్యడ పరశురాములు, ఉప సర్పంచులు ఆకుపత్తిని విజయ్ కుమార్, వివిధ పార్టీల మండల అధ్యక్షులు బండారి తిరుపతి, గంట మహిపాల్, మోత్కూరి సమ్మయ్య, సముద్రాల సంపత్, అలివేలు సమ్మిరెడ్డి, రాసమల్ల శ్రీనివాస్, బొంగోని తిరుపతి, గొడిశాల తిరుపతి, పల్లె స్వరూపతో పాటు పలువురు ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.

