అంగన్వాడి సెంటర్ల సేవలు వినియోగించుకోవాలి
—– సర్పంచి అశోక్ కుమార్
కాకతీయ,నెల్లికుదురు : అంగన్వాడి సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ గర్భిణీలకు,బాలింతలకు,కిశోర బాలికలకు, చిన్నారులకు సూచించారు. మండలంలోని హనుమాన్ నగర్ తండాలో ఐసిడిఎస్ అంగన్వాడి ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి) శుక్రవారం ఏర్పాటు చేశారు. 15 మందితో కూడిన కమిటీకి కన్వీనర్ గా సర్పంచ్ అశోక్ కుమార్ వ్యవహరిస్తారు.ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ బాలల సంరక్షణలో కమిటీ పాత్ర కీలకమన్నారు. సూపర్వైజర్ సుధారాణి మాట్లాడుతూ పిల్లలపై జరిగే నేరాలనియంత్రణ,బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణ,శారీరక మానసిక వేధింపుల నుంచి సంరక్షించడానికి పిల్లలకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి విసిపిసి కమిటీ కృషి ఆ చేస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుధారాణి తెలిపారు.బాలికలకు,పిల్లలకు ఇతరుల నుంచి ఇబ్బందులు తలెత్తితే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, అంగన్వాడీ టీచర్లు గుగులోతు శారద,గుగులోతు మైబు,జయశ్రీ, ఆశా వర్కర్లు, గర్భిణీలు బాలింతలు కిషోర్ బాలికలు పాల్గొన్నారు.

