epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వైఎస్ఆర్‌ నగర్‌ వాసులకు న్యాయం చేయాలి

వైఎస్ఆర్‌ నగర్‌ వాసులకు న్యాయం చేయాలి
గుడిసెవాసులకు పట్టాలివ్వాలి.. బాధ్యులపై కేసులు నమోదు చేయాలి
లేదంటే డిప్యూటీ సీఎం భట్టి పర్యటన అడ్డుకుంటాం!
కాజీపేట భూముల వ్యవహారంపై నాయిని సమాధానం చెప్పాలి
ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ డిమాండ్‌

కాకతీయ, హ‌న్మ‌కొండ : వైఎస్ఆర్‌ నగర్‌ గుడిసెవాసులకు న్యాయం చేయకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన ముగిస్తే అడ్డుకుంటామని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ హెచ్చరించారు. గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని లేదా ఆ భూమి పేదలకు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం కాజీపేట ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్‌ స్థానిక నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాజీపేటలో 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ నాయకులే సీలింగ్‌, ప్రభుత్వ భూములంటూ పేదలతో గుడిసెలు వేయించారని వినయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. 1989–94 మధ్య ప్రజాసంఘాలు ఆ స్థలాన్ని కాపాడాయని, అక్కడ బస్టాండ్‌ నిర్మిస్తామని అప్పటి పాలకులు, అధికారులు ప్రకటించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌ హయాంలో గుడిసెవాసులకు ఇబ్బందులు కలగకుండా చూశామని, పట్టాలిస్తామని చెప్పిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. ఈ భూమి వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆయన, తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చి వారం గడిచినా స్పందన లేదన్నారు. ఈ అంశంపై నాయిని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాజీపేట ప్రజల రవాణా సౌకర్యం కోసం రూ.76 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో 80 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. 100 రోజుల్లో పనులు పూర్తిచేస్తానన్న నాయిని, మూడేళ్లు కావస్తున్నా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రైల్వే స్టేడియంలో బస్టాండ్‌ నిర్మిస్తామని, 100 రోజుల్లో పనులు చేపడతామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌ సాధన కోసం తాము పోరాడినప్పుడు నాయిని ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ, తనపై విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.

మూడు డిమాండ్లు నెరవేర్చాలి

వైఎస్ఆర్‌ నగర్‌ గుడిసెవాసుల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్‌ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, గుడిసెవాసులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని వినయ్‌ భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. బాధితులకు పట్టాలు ఇవ్వాలని లేదా భూమి పేదలకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భట్టి విక్రమార్క పర్యటన పూర్తయ్యేలోపు న్యాయం చేయాలని, లేదంటే స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. స్పందన రాకపోతే పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నార్లగిరి రమేష్‌, సుంచు కృష్ణ, మాజీ కార్పొరేటర్‌ సంకు నర్సింగరావు, గబ్బేట శ్రీనివాస్‌, డివిజన్‌ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్‌, బేధరకోట రంజిత్‌, కుమ్మరి కోటిలింగం, కాటపురం రాజు, బస్వా యాదగిరి, ఎం.డి. ఆఫ్జాల్‌, ఎస్‌.కె. మహుముద్‌, ఎం.డి. హుస్సేన్‌, మర్యాల కృష్ణ, బండి చందర్‌, బరిగెల వినయ్‌, పడిదెల శేఖర్‌, మాతంగి మెహన్‌, మంద శ్రీనివాస్‌, జన్ను శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ మూడు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు సింథటిక్‌ రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌,...

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని ల్యాబార్తి ముద్దు బిడ్డకు...

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం...

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా..

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా.. - బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పగడాల...

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ కాకతీయ, ఇనుగుర్తి : ‘జయ జయహే...

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ఆలేరు...

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో వినూత్న పోటీలు వివిధ అంశాల్లో...

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రెండు రోజుల్లో 3,650 మంది అభ్యర్థులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.