శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి
కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా నంది రెడ్డి నరేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన శంకరపట్నం ఎస్సైగా విధుల్లో చేరారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై శేఖర్ రెడ్డి కరీంనగర్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై నరేష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నరేష్ రెడ్డికి ఏఎస్ఐ సంపత్, హెడ్ కానిస్టేబుళ్లు మోహన్, శ్రీనివాస్‌తో పాటు పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

