తెలంగాణ రక్షణ సమితిలో కీలక నియామకాలు
రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడిగా ఎండీ అహ్మద్ పాషా
కాకతీయ, వరంగల్ : తెలంగాణ రక్షణ సమితి (డెమొక్రటిక్) సంస్థాగత బలోపేతంలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ నూతన నియామకాలు చేపట్టారు. రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడిగా ఎండీ అహ్మద్ పాషాను, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా శంకర్ సాధును నియమించారు. అలాగే శంకర్ సాధుకు రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ మేరకు నూతనంగా నియమితులైన నాయకులకు రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ నియామక పత్రాలు అందజేశారు. తమపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఎండీ అహ్మద్ పాషా, శంకర్ సాధు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

