మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు
*మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే చల్లా..
కాకతీయ, గీసుగొండ: వివిధ కారణాల చేత మృతిచెందిన మృతులకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘన నివాళులు అర్పించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ గరీబ్ నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొజ్జం తిరుపతి కుమార్తె జ్యోతి మృతిచెందిన విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదేవిధంగా గ్రామానికి చెందిన రామంచ కమలమ్మ పార్థివదేహాన్ని సందర్శించి నివాళు లర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

