ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
చేయూత ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ
కాకతీయ,నెల్లికుదురు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తుందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు లోని ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్,ఎంపీ బలరాం నాయక్ మంగళవారం పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
స్థానిక సర్పంచి పులి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే,ఎంపీ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సన్న బియ్యం,రేషన్ కార్డులో మంజూరి,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రైతులకు రుణమాఫీ,గృహాలకు విద్యుత్ ఫ్రీ కంటి ఎన్నో పథకాలు ఎప్పటికీ ప్రతి కుటుంబానికి వర్తిస్తున్నట్లు గుర్తు చేశారు.
నెల్లికుదురు తో పాటు వివిధ గ్రామాలకు చెందిన అర్హులకు నూతనంగా 682 మందికి పెన్షన్లు మంజూరు కాగా ఎమ్మెల్యే ఎంపీ చేతుల మీదుగా వివిధ గ్రామాల వారికి అందజేసి వారు మాట్లాడుతూ తమ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తుందన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్ల తో పాటు అన్ని రకాల పథకాలను ఇస్తున్నట్లు తెలిపారు.
ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకుని నవంబర్ 19 నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం కుటుంబ బీమా పథకం అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ స్పష్టం చేశారు. కుటుంబంలో దురదృష్టవశాత్తు ఏ కారణంతో నైనా వ్యక్తి కన్నుమూస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా డబ్బులను అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబం పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ బీమా కోసం డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో తహసిల్దార్ చంద నరేష్, ప్రత్యేకాధికారి మరియన్న,ఎంపీడీవో సింగారపు కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎదల ఎదల్ల యాదవ రెడ్డి,సర్పంచులు,ఉప సర్పంచిలు,పంచాయతీ కార్యదర్శులు,వార్డు సభ్యులు, కాంగ్రెస్ జిల్లా,మండల,గ్రామ నాయకులు పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

