epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్మార్ట్‌ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం

స్మార్ట్‌ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం
మాజీ మేయ‌ర్ సర్ధార్ రవీందర్ సింగ్
మహాత్మా జ్యోతిబాపులే పార్క్‌ భూమి విద్యుత్ శాఖకు కేటాయింపుపై ఆగ్ర‌హం

కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తూ నగర అభివృద్ధికి చేపట్టిన పనులను ఇప్పుడు అధికారులు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గతంలో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబాపులే పార్క్‌ను ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీ బోర్డుకు అప్పగించామని, కానీ ఇప్పుడు అదే పార్క్‌లోని 4 గుంటల భూమిని విద్యుత్ శాఖకు కేటాయించడం నగర అభివృద్ధి ఆత్మను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు సేకరించకుండానే పార్క్ భూమిని మరో శాఖకు కేటాయించడం స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన అని అన్నారు. చట్టంలో ఎక్కడా కూడా పార్క్‌లలోని భూములను ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లేదని, స్మార్ట్ సిటీ కింద ఉన్న భూములను కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసమే వినియోగించాలనే నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. పార్క్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా భవిష్యత్తులో అనుకోని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలోని పలు పార్క్ స్థలాలను కమ్యూనిటీ హాళ్లు, యూత్ క్లబ్బులుగా మార్చడం కూడా అదే ధోరణిలో జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా జారీ చేసిన సర్కులర్‌పై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కౌన్సిల్ లేకుండా, ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా ప్రతి ఇంటి నుంచి నెలకు 60 రూపాయల చొప్పున వసూలు చేయడం ప్రజలపై భారీ భారం మోపటమేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా ఇండ్లు ఉండగా నెలకు 60 లక్షలకుపైగా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది ప్రజాపాలన పేరుతో జరుగు ఇష్టానుసార పాలనకే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజలు పన్నులు చెల్లిస్తుండగా శానిటైజేషన్ పేరుతో మళ్లీ కొత్తగా వసూళ్లు ప్రారంభించడం అర్థరహితమని ప్రశ్నించారు. కాంట్రాక్టు వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ జ్యోతిబాపులే పార్క్ 4 గుంటల భూమిని ఎలా కేటాయించగలిగారు అని ప్రశ్నించిన ఆయన వెంటనే ఆ జీఓను రద్దు చేయాలని, శానిటైజేషన్ పేరుతో జరుగుతున్న వసూళ్లను నిలిపేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ నగర మేధావులు, బుద్ధిజీవులు కూడా ఈ అంశంపై స్పందించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.