epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌
వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
విమానయాన రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు
2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు..
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ల‌క్ష్యం
ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
బెంగళూరు-హైదరాబాద్ ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో విమానయాన రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరో పార్క్‌లో ఫ్రెంచ్‌ దిగ్గజ సంస్థకు చెందిన సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఇండియా ఫెసిలిటీని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. భారత ఏవియేషన్‌ రంగంలో ఇదో కీలక మలుపన్న మోదీ, సాఫ్రాన్‌ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఫ్రెంచ్ దిగ్గజ సంస్థ సాఫ్రాన్‌ వాణిజ్య విమానాలకు శక్తినిచ్చే లీప్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ సౌకర్యాన్ని కల్పించనుంది. ఏవియేషన్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాల్లో పేరెన్నిక గన్న సఫ్రాన్‌ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన రఫెల్ ఫైటర్ జెట్‌లో వినియోగించే ఇంజిన్ల కోసం మరో ప్రత్యేక మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ ఫెసిలిటీని త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇవాళ్టి నుంచి భారతదేశ విమానయాన రంగం కొత్త ఊపును సంతరించుకుంటుందన్న ప్రధాని సాఫ్రాన్ ఏర్పాటు చేసిన ఎమ్ఆర్‌ఓ కేంద్రం వల్ల భారతదేశాన్ని గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు.

సాఫ్రాన్ సంస్థకు ధన్యవాదాలు

సాఫ్రాన్‌ సంస్థ ఏర్పాటు హైదరాబాద్‌ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్రెంచ్‌ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌ను ఎంచుకున్న సాఫ్రాన్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు హైదరాబాద్‌ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని, ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందన్నారు. ఏవియేషన్‌కు చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో నెలకొన్నాయని, ఏవియేషన్‌, ఎరోస్పేస్‌కు చెందిన ఉన్నత నిపుణులు కూడా హైదరాబాద్‌ ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూర్ మధ్య వైమానిక, రక్షణ రంగ కారిడార్‌ ఏర్పాటు చేయాలని ప్రధానిని సీఎం కోరారు. ఏవియేషన్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాల్లో పేరెన్నిక గన్న సఫ్రాన్‌ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన రఫెల్ ఫైటర్ జెట్‌లో వినియోగించే ఎం 88 ఇంజిన్ల కోసం ప్రత్యేక మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం జీఎంఆర్ ఏరోపార్క్‌లోనే ఏర్పాటు చేసే ప్రత్యేక ఫెసిలిటీ కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు భూమిపూజ చేశారు.

2026లో అందుబాటులోకి..

సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఫెసిలిటీ 2026లో అందుబాటులోకి రానుంది. ఏటా 300 లీప్‌ ఇంజిన్లకు సేవలందించే ఈ ఫెసిలిటీ 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఫెసిలిటీ ద్వారా వెయ్యి మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయ సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లకు ఉపాధి లభించనుంది. ఈ కొత్త ఫెసిలిటీలో స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వల వినియోగం తగ్గటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ ఫెసిలిటీ ద్వారా భారతదేశం ప్రపంచ విమానయానానికి హబ్‌గా మారనుంది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.