epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చెక్ డ్యాంపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు

చెక్ డ్యాంపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు
కౌశిక్ రెడ్డి బోగస్ ప్రచారాలు మానుకోవాలి
హరీష్ రావును రాజకీయం నుంచి రాజీనామాకు తీసుకొచ్చాడు
ఇసుక దందా, క్వారీలు మొదలు పెట్టిందెవ‌రు?
అధికారంలో ఉన్నప్పుడు మానేరును బీఆర్ఎస్ నాయకులు చెర పట్టారు
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం
జమ్మికుంట విలేకరుల సమావేశంలో వొడిత‌ల ప్ర‌ణ‌వ్

కాకతీయ, హుజురాబాద్ : తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాంపై విచారణ కొనసాగుతుందనీ మరో నాలుగైదు రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పూర్తిస్థాయి నివేదికరాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చెప్పినట్టు ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేసిన ఊరుకోమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు ప్రధాన కారణం బీఆర్ఎస్ నాయకులని, వాస్తవాలు తెలుసుకోకుండా హరీష్ రావు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఒకవేళ చెక్ డ్యాం పేల్చితే 0దాని ఆనవాళ్లు చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటాయి కదా చిన్న పటాకా పేలిస్తేనే చెల్లా చెదుర‌వుతాయ‌ని అన్నారు. అలాంటిది ఇంత పెద్ద చెక్ డ్యాం పేల్చారని ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు వాటి ఆనవాళ్లు చూపించడం లేదని అన్నారు. కరీంనగర్ వేదికగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు విసిరిన సవాల్ కు కౌశిక్ రెడ్డి స్పందించడం హాస్యాస్పదమని కాంక్రీట్ కి, గుండు రాయికి తేడా తెలవని కౌశిక్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.

ఆన‌వాళ్లు క‌నిపించ‌లేదు..

చెక్ డ్యాం పేల్చారు అంటున్న బీఆర్ఎస్ నాయకులు కాంక్రీట్ లో జిలేటిన్ స్టిక్స్ పెడతారా లేదా కుంగిన ప్రదేశం నుండి దూరంగా ఉన్న బండరాలలో పెడతారా అని ప్రశ్నించారు? గతంలో మేము పరిశీలించినప్పుడు అక్కడ ఇలాంటి ఆనవాళ్లు ఏం కనబడలేదని,యథాస్థితిలో ఇల్లు నిర్మించేటప్పుడు కానీ చెక్ డ్యాం కట్టేటప్పుడు కానీ కింద రాళ్లు వేసి కడతారో అలాగే సమాంతరంగా రాళ్లు ఉన్నాయని, కౌశిక్ రెడ్డి మెదడు సరిగా పనిచేయదని అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నారు. నాసిరకమైన నిర్మాణం,కమీషన్ల కక్కుర్తి కోసం నిర్మాణాలు చేపట్టడం ద్వారానే ఇలాంటి నష్టం జరిగిందని,ఇసుకపై నిర్మాణం చేపట్టడం వలన ఇంతటి అనార్థం జరిగిందని, గతంలో 2022 లో కూడా ఈ చెక్ డ్యాం కుంగిందని ఇక్కడి రైతులే చెప్తున్నారని దీంతోపాటు విలాసాగర్,తనుగుల,మల్లారెడ్డిపల్లి,పెద్దపల్లి జిల్లాలోని నాలుగు చెక్ డ్యాంములు ఆనాడు కూలిపోయాయని అన్నారు.

నీటి పారుదల శాఖలో ఐదేళ్ల అనుభవం ఇదేనా హరీష్ రావు : ప్రణవ్

ఐదేళ్లపాటు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు కౌశిక్ రెడ్డి మాయలో పడ్డారని అందుకే హరీష్ రావు ను రాజకీయం నుండి రాజీనామా వరకు కౌశిక్ రెడ్డి తీసుకొచ్చారని ప్రణవ్ అన్నారు. హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కి కూడా ఈ విషయంపై అవగాహన ఉందని అందుకే అక్కడ ఏం మాట్లాడలేదని అన్నారు. గుంపుల రామభద్ర స్వామి సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. మరోవైపు కౌశిక్ రెడ్డి బోగస్ ప్రచారాలు చేస్తాడని,అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని అన్నారు. కార్యక్రమంలో పీసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,జమ్మికుంట పట్టణ,మండల అధ్యక్షులు రమేష్,పరశు రామ్,మహిళా అధ్యక్షురాళ్ళు రేణుక,స్వప్న,సీనియర్ నాయకులు గుడెపు సారంగపాణి,ఆరుకాల వీరేశలింగం,పొనగంటి మల్లయ్య,దేశినీ కోఠి,సదానందం,శివ,సలీం,శ్రీను,రామస్వామి మాజీ కౌన్సిలర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు,మైనారిటీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.