epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేంద్ర నిధులకోసమే పంచాయతీ ఎన్నికలు

కేంద్ర నిధులకోసమే పంచాయతీ ఎన్నికలు
బీజేపీ నేత బాస సత్యనారాయణ

కాకతీయ, కరీంనగర్ : పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నిజమైన కారణమే కేంద్రం నిధులని, గ్రామాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు అందిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాస సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో మహాత్మా నగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.గ్రామాభివృద్ధికి కావాల్సిన ప్రతి రూపాయిని కేంద్రం పంపుతుందనీ, ప్రజల ఇళ్లలో వెలిగే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ నుంచి రోడ్లు, వీధి లైట్లు, రేషన్ బియ్యం, ఉపాధి హామీ కింద 100 రోజుల పనులు వరకు అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వమే అందజేస్తోందని సత్యనారాయణ పేర్కొన్నారు. అంగన్వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, కందకాల తవ్వకాలు, ప్రతి గ్రామంలో జరుగుతున్న పనులకు నరేగా నిధులే బలమని చెప్పారు. ఎక్కడా లేని విధంగా బండి సంజయ్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, బోర్లు, డ్రైనేజీలు నిర్మించారని తెలిపారు. సీఎస్సార్ నిధులను సమీకరించి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించారని గుర్తు చేశారు. పదవ తరగతి విద్యార్థులకు 20 వేల సైకిళ్ల పంపిణీ, పరీక్షా ఫీజుల చెల్లింపులు, ‘మోదీ గిఫ్ట్’ పేరిట ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చిన విషయాలను ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేసిందా? ఎమ్మెల్యేల దగ్గర ఊరిని బాగుచేయడానికి సొంత నిధులున్నాయా? గత ప్రభుత్వ కాలంలో నిధుల లేమితో సర్పంచులు పడిన ఇబ్బందులు, ఆత్మహత్యలకు వెళ్లిన సంఘటనలను ప్రజలు మరువకూడదని అన్నారు. గ్రామాల అభివృద్ధి కావాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి చాడ అనితా రెడ్డి, జిల్లా ఈసి మెంబర్ బూట్ల శ్రీనివాస్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు గడ్డం అరుణ్, బుర్ర శ్రీనివాస్, రామిడి మహేందర్ రెడ్డి, బండి స్వామి, ఉప్పునూటి సాగర్, జంగ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.