epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోతి చేసిన పనికి కోట్ల నష్టం

కోతి చేసిన పనికి కోట్ల నష్టం
కొండగట్టు అగ్ని ప్రమాదంలో 30 షాపులు ద‌గ్గం
కళ్ల ముందే బూడిద పాలైన దుకాణాలు
వీధిన పడిన కుటుంబాలు.. మేడారం జాతర నేపథ్యంలో వ్యాపారుల‌ భారీ పెట్టుబడులు
అలస్యంగా అందుకున్న అగ్నిమాపక సేవలు
కాకతీయ గ్రౌండ్ రిపోర్ట్

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కోతి చేసిన పని.. కోట్ల నష్టాన్ని మిగిల్చింది. కొండ‌గ‌ట్టులో శ‌నివారం రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో 30 కుటుంబాలు జీవ‌నాధారాన్ని కోల్పోయి రోడ్డున ప‌డ్డాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గ్రామంలో శ‌నివారం రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో వ్యాపారులు భారీగా న‌ష్ట‌పోయారు. ఆభంయాజనేయ స్వామి బొమ్మల వీధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 30 షాపులు పూర్తిగా బూడిద అవగా 2 కోట్ల పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.

 

బొమ్మల వారీ వీధిలోని అభయాంజనేయ స్వామి దేవాలయం సమీపంలోని ఒక బొమ్మల షాపుపై ఉన్న రేకులపై కొతి ఎగిరి గంతులు వేయడంతో ఆ రేకులపై ఉన్న కరెంట్ సర్వీస్ వైర్ తెగి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో అక్కడ ఉన్న బొమ్మల షాపులో మంటలు చెలరేగగా సుమారు గంట వ్యవధిలోనే క్రమేపి మంటలు విస్తరించాయి. బొమ్మల షాపులు, దేవుడి చిత్రపటాల షాపులు, గాజుల షాపులు, బ్యాగుల షాపులు మొత్తం 30 షాపులు బూడిదపాలయ్యాయి. క్ష‌ణాల్లో మంట‌లు వ్యాపించ‌డంతో నిద్ర నుంచి లేచి మేల్కోనేలోపే షాపుల‌న్నీ కాలి బూడిద‌య్యాయి. లక్షల రూపాయల సామగ్రి కళ్ల ముందే కాలిపోతున్న నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. కళ్ల ముందే బూడిదపాలవుతున్నా తాము ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని గుండెలు బాధుకుంటూ వెల్ల‌డించారు. బొమ్మ‌ల వ్యాపారం చేసుకుంటున్న వారంతా కూడా మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు మరికొన్ని ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం కొండగట్టుకు వలస వ‌చ్చి జీవిస్తున్నారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాల ఇళ్లలోని నిత్యవసర సామగ్రి, బట్టలు, నగదు, బంగారం, విద్యార్హతల సర్టిఫికెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

మేడారం నేప‌థ్యంలో భారీగా పెట్టుబ‌డులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జనవరి నెలలో జరిగే సమ్మక్క–సారక్క వనదేవతల జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వేములవాడ, కొండగట్టుకు వచ్చి దర్శనాలు చేసుకోవ‌డం ఆన‌వాయితీగా భావిస్తారు. ఈనేప‌థ్యంలోనే ఇక్కడి నుంచి వనదేవతల దర్శనాలకు వెళ్తారు. అయితే ఈ సమయమే తమ వ్యాపార కాలం కావడంతో అగ్ని ప్రమాద వ్యాపార బాధితులందరూ భారీగా పెట్టుబడులు పెట్టి వ్యాపారానికి అవసరం అయ్యే సామగ్రిని, వస్తువులను నిల్వ చేసి ఉంచుకున్నారు. ఆకస్మాత్తుగా జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో కూడిన అగ్ని ప్రమాదం వల్ల పెట్టిన పెట్టుబడులు మొత్తం అగ్నికి ఆహుతయ్యి బూడిదపాలైంద‌ని బాధితులు రోధించారు.

అలస్యంగా అందుకున్న అగ్నిమాపక సేవలు

రాత్రి 10.30 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా వెంటనే స‌మాచారాన్ని అందించినా అగ్నిమాపక శాఖ అధికారులు గంటన్నర ఆల‌స్యంగా చేరుకున్నార‌ని బాధితులు వెల్ల‌డిస్తున్నారు. అగ్నిమాపక శాఖ వేగంగా స్పందించి ఉండి ఉంటే తమకు ఇంతటి నష్టం వాటిల్లేది కాదని తెలిపారు. జగిత్యాల నుంచి మల్యాల చౌరస్తా వరకూ సుమారు 15 వరకు వైట్ లైన్ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. అయితే అదే మార్గం గుండా వస్తున్న ఫైర్ ఇంజన్ వాహనం వైట్ లైన్ స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఫైర్ ఇంజన్ వాహనంలో గేర్ బాక్స్ లో సమస్య రావడంతో ఫైర్ ఇంజన్ వాహనం మల్యాల ఎక్స్ రోడ్ సమీపంలో రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ సమస్య కారణంగా కరీంనగర్, ధర్మాపురి, చోప్పదండి నుండి ఫైర్ ఇంజన్ వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేపట్టాయి.

నిద్ర‌పోయి ఉన్నాం
: పల్లెర్ల స్వప్న, గాజుల షాపు నిర్వాహకురాలు

నిద్రపోయి ఉన్నాము. మంటల వేడి తగులుతుండడంతో లేచి బయటకి పరిగులు తీశాం. అప్పటికే మంటలు భారీగా వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్‌కు ఫోన్ చేస్తే 2 గంటల తరువాత వచ్చింది. కట్టు బట్టలతో మిగిలిపోయాము. మాకు ఇప్పుడు ఏం చేయాలో ఏమి తెలియడం లేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.