epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఐరోపాలో బెలూన్ల చిచ్చు.. రెండు దేశాల మ‌ధ్య కొత్త కోల్డ్ వార్!

ఐరోపాలో బెలూన్ల చిచ్చు.. రెండు దేశాల మ‌ధ్య కొత్త కోల్డ్ వార్!
బెలారస్–లిథువేనియా మధ్య ఉద్రిక్తతల విస్ఫోటనం
ఎగిరే బెలూన్లతో ఎయిర్‌పోర్ట్‌లు షట్‌డౌన్
60 బెలూన్లు గుర్తింపు, 40 కీలక ఎయిర్‌జోన్‌లోకి ప్రవేశం

కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ డెస్క్‌: యూరప్‌లో ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉద్రిక్తతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో, ఇప్పుడు బెలూన్లు రెండు దేశాల మధ్య కొత్త కోల్డ్ వార్‌కు నాంది పలుకుతున్నాయి. బెలారస్, లిథువేనియా మధ్య నెలకొన్న ఈ అసాధారణ వివాదం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా వాతావరణాన్ని కొలవడానికి ఉపయోగించే వెదర్ బెలూన్లు ఇప్పుడు రన్‌వేలను మూసే స్థాయికి చేరి, గగనతల భద్రతను తలకిందులు చేస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు బెలారస్ వెదర్ బెలూన్లను ప్రయోగిస్తోంది. అయితే, అవి నియంత్రణ తప్పి లిథువేనియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఫ‌లితంగా లిథువేనియాలో విమాన సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. లిథువేనియా ఆరోపణల ప్రకారం, ఇటీవల బెలారస్ వైపు నుంచి వచ్చిన 60 బెలూన్లలో 40 నేరుగా అత్యంత కీలకమైన విమాన భద్రతా జోన్‌లోకి ప్రవేశించాయి. ఫలితంగా, విల్నియస్ అంతర్జాతీయ విమానాశ్రయం 11 గంటలపాటు పూర్తిగా నిర్వీర్యమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది తలనొప్పి అయిందని, ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని బెలూన్లను ఒక ప్రత్యేక పథకం ప్రకారం ప్రయోగిస్తున్నారని లిథువేనియా మండిపడుతోంది. ఈ చర్యలను వారు సూటిగా హైబ్రిడ్ అటాక్ అని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మాత్రం ఇవన్నీ వెదర్ బెలూన్లే అని, ఏదైనా తప్పిదం జరిగితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని చెప్పినా, లిథువేనియా దీన్ని అసలు నమ్మడం లేదు. మ‌రోవైపు అంతర్జాతీయ మీడియా మరింత ఆసక్తికర అంశాలను బయటకు తెచ్చింది. ఈ బెలూన్లను నిషేధిత వస్తువులు మరియు అనుమానాస్పద సామగ్రి తరలించడానికి కూడా ఉపయోగించవచ్చని చర్చ నడుస్తోంది.

ఇక బెలారస్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. లిథువేనియానే తమ గగనతలంపై డ్రోన్లను ప్రయోగించి గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తోంది. అదేవిధంగా, బెలూన్లను, డ్రోన్లను ఉపయోగించి ఉగ్రవాదులకు అవసరమైన సామగ్రి చేరవేస్తున్నారన్న ఆరోపణలతో వివాదం మ‌రింత ముదిరింది. ఈ పరిణామాలతో రెండు దేశాల దౌత్య సంబంధాలు గట్టిగా దెబ్బతిన్నాయి. లిథువేనియా సరిహద్దులను మూసేయగా, ప్రతిగా బెలారస్ వెయ్యికి పైగా లిథువేనియా కార్గో ట్రక్కులను నిలువరించింది. కాగా, యూరప్ ఖండం ఇప్పటికే నాటో గగనతలంలోకి ప్రవేశించిన రహస్య డ్రోన్లతో టెన్షన్‌లో ఉండగా, ఇప్పుడు బెలూన్ల వివాదం అగ్నిపర్వతంలా పెల్లుబికే ప్రమాదం కనిపిస్తోంది. బెలూన్లతో మొదలైన ఈ సంక్షోభం, రెండు దేశాల మధ్య భద్రతా సవాళ్లను కొత్త కోణంలో చూపుతూ, ఐరోపా భవిష్యత్ స్థిరత్వాన్నే ప్రశ్నార్థకంగా నిలబెడుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.