epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విచారణ పేరుతో కాలయాపనా?

విచారణ పేరుతో కాలయాపనా?
డ్యూటీలోనే మద్యం సేవించిన అధికారులపై చర్యలేవీ?!
ప్రభుత్వ వాహనంలో ప్రైవేటు పార్టీకి మద్యం తరలింపు
సాక్ష్యాధారాలతో కథనం ప్రచురించిన కాకతీయ
నెలరోజులైనా ‘విచారణ’ పేరుతో జాప్యం
సామాన్యులపైనే ప్రతాపమా..?
సొంత శాఖ అధికారుల తప్పిదాలకు శిక్షలుండవా..?
బ‌హిరంగ ఉల్లంఘ‌ణ‌ల‌పైనా చూసి చూడ‌న‌ట్లే..!
మాముళ్ల మ‌త్తే అధికారుల వైఖ‌రి కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలోనే మద్యం తరలింపు, డ్యూటీలో ఉన్నప్పుడే మద్యం సేవించినట్లు వచ్చిన ఆరోపణలు వంటి అత్యంత తీవ్రమైన అంశాలు వెలుగులోకి వచ్చినా, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై సాక్ష్యాధారాలతో సహా కాకతీయ దినపత్రిక కథనాలు ప్రచురించినప్పటికీ, అధికారుల నుంచి వినిపిస్తున్న సమాధానం ఒక్కటే— “విచారణ జరుగుతోంది”. అయితే ఆ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? తప్పు చేసిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అన్న ప్రశ్నలకు మాత్రం నెలలు గడుస్తున్నా సమాధానాలు లేవు. అక్టోబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా కథనాలు వెలువడినా శాఖలో ఎలాంటి కదలిక కనిపించకపోవడం గమనార్హం. విచారణ బాధ్యతలు అప్పగించామన్న ప్రకటనలే తప్ప, నివేదికలు, నిర్ణయాలు, శిక్షలు ప్రజల ముందుకు రాకపోవడం ఎక్సైజ్ శాఖ పనితీరుపై అనుమానాలను మరింత బలపరుస్తోంది. నిజంగానే విచారణలు జరుగుతున్నాయా? లేక కాలం గడిపే ప్రక్రియగానే మిగిలిపోయాయా? అన్న సందేహాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

బహిరంగంగా ఉల్లంఘించినా..!

కరీంనగర్ నగరంలోని పలు వైన్స్, పర్మిట్ రూంలలో నిబంధనలకు విరుద్ధంగా డబుల్ సిట్టింగులు, అనధికార షెడ్లు, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ అక్రమాలు సాగుతున్నా, క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం అధికారుల మౌనానికి నిదర్శనంగా మారింది. ప్రతి వివాదాస్పద ఘటనపై అధికారులు ఇచ్చే సమాధానం ఒకే తీరుగా ఉండటం గమనార్హం— “సంబంధిత అధికారికి తెలియజేశాం… విచారణలో ఉంది”. అయితే ఈ మాటల తర్వాత ఒక్క చర్య కూడా కనిపించకపోవడంతో, ఇవి కేవలం మాటలకే పరిమితమైన ప్రకటనలుగా మిగులుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చర్యలు ఉండవన్న భావన బలపడటంతో వైన్స్ నిర్వాహకులు నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బలపడుతున్న అనుమానాలు

నెలలు గడుస్తున్నా ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన చర్యలు లేకపోవడం వెనుక నెలవారీ ముడుపుల వ్యవస్థే కారణమన్న అనుమానాలు కరీంనగర్ ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై వివరణ కోరగా కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించారు. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలో మద్యం తరలించిన ఘటనపై అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించామని, సోమవారం పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు. అలాగే వెంకటేశ్వర వైన్స్‌లో కొనసాగుతున్న నిబంధనల ఉల్లంఘనలు, డబుల్ పర్మిట్ రూం నిర్వహణపై వివరణ కోరగా, ఈ విషయాన్ని సంబంధిత ఎక్సైజ్ సీఐకి తెలియజేశామని చెప్పారు. అయితే ఈ ఘటనలు వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క స్పష్టమైన చర్య కూడా కనిపించకపోవడం పట్ల ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, విచారణలను వేగవంతం చేసి, తప్పు చేసిన వారు ఎవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.