epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సురేష్ కల్మాడీ క‌న్నుమూత‌

సురేష్ కల్మాడీ క‌న్నుమూత‌

తీవ్ర అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస‌

యూపీఏ హ‌యాంలో కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవ‌లు

క‌ల్మాడి మృతిపై మోదీతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు, క్రీడా ప్రముఖులు సంతాపం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: భారత రాజకీయాల్లో, క్రీడా పాలనా విభాగంలో దశాబ్దాలపాటు తిరుగులేని నాయకుడిగా వెలిగిన సురేష్ కల్మాడీ (81) ప్రస్థానం ముగిసింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున పుణేలో క‌న్నుమూశారు. దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త పుణేతోపాటు జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా కెరీర్ ప్రారంభించి.. కేంద్ర మంత్రిగా ఎదిగిన కల్మాడీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా పుణే నగరాన్ని ఆధునిక అభివృద్ధి బాటలో నడిపించడంలో ఆయన చేసిన కృషి వెలకట్టలేనిద‌ని సంతాపం వ్యక్తం చేశారు ఆయ‌న అభిమానులు. మహారాష్ట్రలోని పుణేను తన రాజకీయ కేంద్రంగా చేసుకున్న సురేష్ కల్మాడీ.. ఆ నగరాన్ని ఆధునిక అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. 1977లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. పుణే లోక్‌సభ నియోజక వర్గం నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నిక అయ్యారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావు హయాంలో (1995-96) కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ముంబైలోని ఐకానిక్ విక్టోరియా టెర్మినస్‌ను ఛత్రపతి శివాజీ టెర్మినస్‌గా మార్చడంలో ఆయన చూపించిన చొరవను స్థానిక ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సుదీర్ఘ కాలం సేవలు అందించారు.

క్రీడా రంగంలో రారాజుగా..

రాజకీయాల కంటే క్రీడా నిర్వాహకుడిగానే కల్మాడీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1996 నుంచి 2011 వరకు సుదీర్ఘ కాలం పని చేశారు. ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించారు. అయితే 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో తలెత్తిన అవినీతి ఆరోపణలు ఆయన కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పాయి. ఈ కేసులో ఆయన తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇటీవలే (ఏప్రిల్ 2025) ఢిల్లీ కోర్టు మనీ లాండరింగ్ కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ కేసును క్లోజ్ చేసింది. సురేష్ కల్మాడీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం మహారాష్ట్ర ఎరందవనేలోని ఆయన నివాసం కల్మాడీ హౌస్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నవీ పేటలోని వైకుంఠ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కల్మాడీకి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మనవలు ఉన్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.