epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు

ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు
ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతో నిర్ణయం
అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
రామ‌గుండం సీపీ అంబ‌ర్ కిశోర్ ఝా

కాకతీయ, రామగుండం : నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకిచెందిన ఎనిమిది మంది మావోయిస్టులు శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎదుట లొంగిపోయారు. మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీకి చెందిన సభ్యులు అంబర్ కిశోర్ ఝా సమక్షంలో కమిషనరేట్ కార్యాలయంలో లొంగుబాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపుతున్న ఆదరణ, పునరావాస పథకాల వివరాలు తెలుసుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలనే ఉద్దేశంతో వీరు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే పునరావాస పథకాల కింద అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కార్యకలాపాలు

లొంగిపోయిన ఎనిమిది మంది మావోయిస్టులు మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ వంటి విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. వీరి కార్యకలాపాలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగినట్లు పోలీసులు వెల్లడించారు. ధర్మాజీ శ్రీకాంత్ (జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఇటీక్యాల గ్రామం) 2019 నుంచి మావోయిస్టు పార్టీలో కొరియర్‌గా పనిచేశాడు. 2024లో వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టై జైలు నుంచి విడుదలైన అనంతరం తిరిగి పార్టీలో చేరి సీనియర్ నాయకులకు కొరియర్‌గా వ్యవహరించాడు. పొడియం కాములు మిలీషియా కమాండర్‌గా పనిచేస్తూ స్థానిక సమీకరణలో కీలక పాత్ర పోషించాడు. ముడియం జోగ చైతన్య సాంస్కృతిక విభాగానికి చెందిన నాట్య మండలితో సంబంధం కలిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కుంజం లక్కె పార్టీ సభ్యురాలిగా ఉండి ఆంధ్రి ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుంది. మోదం భీమ, ముడికం సుక్రం, ముడియం మంగు మిలీషియా సభ్యులుగా అడవి కమిటీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కుంజం ఉంగా గూడాచార విభాగం కమాండర్‌గా సమాచారం సేకరణ, లాజిస్టిక్స్ బాధ్యతలు నిర్వహించాడు. లొంగిపోయిన వారిలో శ్రీకాంత్ ఒక్కరే తెలంగాణకు చెందినవాడని, మిగిలినవారు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా గాంగేలూరు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.

అజ్ఞాత మావోయిస్టులకు పిలుపు

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం కమిషనరేట్ పోలీసులు పిలుపునిచ్చారు. గ్రామాలకు తిరిగివచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం పునరావాస పథకాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. “పోరు వద్దు – ఊరు ముద్దు” అంటూ అజ్ఞాత మావోయిస్టులు సమాజంలోకి రావాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, భీమేష్, ఆర్‌ఐ శేఖర్, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.