epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సిరిసిల్లలో అధికార పార్టీకి అగ్నిపరీక్ష!

సిరిసిల్లలో అధికార పార్టీకి అగ్నిపరీక్ష!
కేటీఆర్ కోటలో కాంగ్రెస్‌కు కఠిన సవాల్
స్థానికంగా బలహీనంగా కనిపిస్తున్న కాంగ్రెస్
సిట్టింగ్ కౌన్సిలర్లతో బలంగా బీఆర్‌ఎస్
కేటీఆర్ పట్టు నిలుపుకుంటాడా?
చివ‌రి నిముషంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకుంటారా..?!
ప్రతిష్టాత్మకంగా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు నిజమైన అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో అధికార పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరోవైపు తమ సాంప్రదాయ బలమైన నియోజకవర్గంలో పట్టును నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ బలంగా కనిపిస్తుండగా, అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం స్థానికంగా బలహీనంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల స్పందనకు సూచికగా మారనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత సీరియస్‌గా తీసుకున్నాయి.

కాంగ్రెస్‌కు అవకాశాలు ఎంతవరకు?
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా మారాయి. కేటీఆర్ ఇలాకాలో విజయం సాధించి తమ బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. అధికారంలో ఉన్నామన్న ప్రయోజనాన్ని వినియోగించుకుంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధాన అస్త్రాలుగా ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. గత ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్, ఈసారి స్థానిక బీఆర్‌ఎస్ నాయకులపై ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను ఆకర్షించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అయితే స్థానికంగా కాంగ్రెస్‌కు సంస్థాగత బలం కొరవడిందన్న విమర్శలు ఉన్నాయి. క్యాడర్ లోపం, నాయకత్వ సమన్వయం లేకపోవడం వంటి అంశాలు పార్టీకి పెద్ద సవాలుగా మారాయి. టికెట్ల కేటాయింపు నుంచి ప్రచార వ్యూహం వరకు ఐక్యత లోపించడంతో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితి ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది.

కేటీఆర్ పట్టు నిలుపుకుంటాడా?
మరోవైపు సిరిసిల్లపై తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో మున్సిపాలిటీపై సంపూర్ణ పట్టు సాధించిన బీఆర్‌ఎస్, ఈసారి కూడా అదే స్థాయిలో ఫలితాలు రాబట్టాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. కేటీఆర్ వ్యక్తిగత ఇమేజ్ స్థానికంగా బీఆర్‌ఎస్‌కు ప్రధాన బలంగా మారింది. పార్టీ క్యాడర్ క్రమబద్ధంగా పనిచేయడం, స్పష్టమైన ప్రచార వ్యూహం అమలు కావడం బీఆర్‌ఎస్‌కు కలిసొస్తోంది. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మున్సిపల్ పాలనలో సాధించిన విజయాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేటీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టడం కూడా బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం స్థానికంగానే కాకుండా రాష్ట్ర రాజకీయాలపైనా ప్రభావం చూపే అవకాశముంది. పాలన పరంగా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా గట్టిగా పోటీ ఇస్తున్న నేపథ్యంలో, ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

చివరి నిమిషంలో కాంగ్రెస్ పరిస్థితి మారుతుందా?
ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ, అధికార పార్టీగా కాంగ్రెస్ చివరి నిమిషంలో పరిస్థితిని మార్చగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. అంతర్గత విభేదాలను కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందన్నది కీలకంగా మారనుంది. బీఆర్‌ఎస్ అభివృద్ధి పనులు, కేటీఆర్ వ్యక్తిగత ప్రభావం ఎంతవరకు ఓటర్లను ఆకట్టుకుంటాయన్నదే తుది ఫలితాన్ని నిర్ణయించనుంది. అదే సమయంలో అధికార పార్టీగా కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లే వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది కూడా కీలకం. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఆత్మపరిశీలనకు దారి తీసే ఎన్నికగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు తమ బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశంగా మారాయి. ఫలితాలు ఎలా వచ్చినా రాష్ట్ర రాజకీయాలకు కొత్త సంకేతాలు ఇవ్వడం మాత్రం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.