epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌ను పాతరేయాలి

కాంగ్రెస్‌ను పాతరేయాలి
అబ‌ద్ద‌పు హామీల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌
చేర్యాలలో ఒక్క పని చేయని కాంగ్రెస్
ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
అభివృద్ధి, సేవే బీఆర్‌ఎస్ లక్ష్యం
జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి
ఉచిత వైద్య సేవలు కొనసాగిస్తానని హామీ

కాకతీయ, చేర్యాల : ఎన్నికల ముందు ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఓట్ల కోసం వస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో పాతరేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4, 5, 6, 7, 8, 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వార్డు అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేర్యాల పట్టణంలో ఇప్పటివరకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పని కూడా చేపట్టలేదని విమర్శించారు. ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ ..!

ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అమలు కాని హామీలతో మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నీలిమ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నానని, ఈ సేవలు రాబోయే మూడు సంవత్సరాలు కూడా కొనసాగిస్తానని తెలిపారు. పేద ప్రజలు స్వంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న సందర్భాల్లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చెక్కులు అందజేస్తున్నామని, నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సల కోసం ఎల్ఓసీలు మంజూరు చేస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీలను ఆచరణలో చూపిస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న పనులను ప్రజలు బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం పొందినవారు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, అవి పొందని వారు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. మహిళా భృతి రూ.2500 అందిన మహిళలు కాంగ్రెస్‌కు ఓటేయాలని, భృతి అందని వారు బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేస్తూ, ఆ హామీ నెరవేరని మహిళలంతా కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. పట్టణ అభివృద్ధికి బీఆర్‌ఎస్ పార్టీ చేసిన సేవలను ప్రజలు గుర్తించి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.