epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘చెప్పుల దొంగ’కు ఎందుకు ఓట్లేయాలి?

‘చెప్పుల దొంగ’కు ఎందుకు ఓట్లేయాలి?
బజార్ల అప్పు కూడా పుట్టని సీఎంను నమ్ముకుంటే లాభమేమిటి?
బీఆర్‌ఎస్ పాలనలో కబ్జాలు, దోపిడీలే మిగిలాయి
కేంద్రం నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి
బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని, అటువంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా ప్రశ్నించారు. “బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తి నగరాలను ఎలా అభివృద్ధి చేస్తారు? చెప్పుల దొంగలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలి?” అంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని దుర్షేడ్, గోపాల్‌పూర్, సప్తగిరి కాలనీ, ఉస్మానీ అసోసియేట్స్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున బండి సంజయ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. 4, 5, 44, 45, 13వ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు భూపతి రవీందర్, చిందెం హారిక, బండి తార, గడప విజయలక్ష్మి, రెడ్డవేణ లావణ్యలను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీధి సభల్లో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తనపై నమ్మకం లేదని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. “నాకు బజార్ల అప్పు కూడా పుట్టడం లేదు, ఢిల్లీలో చెప్పులెత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు అని రేవంత్ రెడ్డే అన్నారు. మరి అలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలి?” అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు..!

బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, పదేళ్లుగా కబ్జాలు, దోపిడీలే జరిగాయని బండి సంజయ్ మండిపడ్డారు. “మళ్లీ ఆ పార్టీలను గెలిపిస్తే కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి దోచుకోకుండా ఉంటారా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడదా?” అని ప్రజలను ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వస్తే ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు నిలదీయాలని, బీఆర్‌ఎస్ నాయకులు వస్తే గత పదేళ్ల పాలనపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరిగిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నగరానికి రూ.1,500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మోదీని గుర్తుపడతారా? వాళ్లు అడిగితే మోదీ నిధులు ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. “కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసింది బీజేపీయే” అని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు ఇటీవలే కేంద్రం రూ.50 కోట్లు మంజూరు చేసిందని, ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.134 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇంటి పన్నులు, నల్లా ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచడం ఖాయమని హెచ్చరించారు. బీజేపీకి ఓటేస్తే మాత్రం ఎలాంటి పన్నులు పెంచకుండా కేంద్ర నిధులతోనే నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర నిధులు దారి మళ్లి అభివృద్ధి నిలిచిపోతుందని హెచ్చరించారు. బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే కరీంనగర్‌కు వరదలా నిధులు తీసుకొచ్చే బాధ్యత తానే తీసుకుంటానని బండి సంజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.