epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చేర్యాల పోరాటాలకు పురిటి గడ్డ

చేర్యాల పోరాటాలకు పురిటి గడ్డ
బీఆర్‌ఎస్ హయాంలో మహిళల నిధుల దోపిడీ
ఈ ఏడాదిలోనే చేర్యాలకు రూ.36 కోట్ల నిధులు
12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
చేర్యాల‌లో కాంగ్రెస్ జెండా ఎగురాలి : మంత్రి సీతక్క
పల్లా ఓ యామ‌గాడు.. దొంగ ఓట్ల స్పెష‌లిస్టు
కాళేశ్వరం కాదు… కూలేశ్వరం అయ్యింది
భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి

కాకతీయ, చేర్యాల : మున్సిపల్ ఎన్నికల వేళ చేర్యాల పట్టణం రాజకీయ వేడితో దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ చేర్యాల ప్రాంతం చైతన్యానికి అడ్డగా, పోరాటాలకు పురిటి గడ్డగా చరిత్రలో నిలిచిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పావలా వడ్డీ పేరుతో మహిళల నుంచి రూ.3 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలోనే చేర్యాల అభివృద్ధికి రూ.36 కోట్ల నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని మంత్రి సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాల‌నే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా సంఘాల అభయహస్తం రుణాల పేరుతో రూ.200 కోట్లను కాజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చేర్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే మొత్తం 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో చేర్యాల ప్రాంతం తన అసిత్త్వాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ నిధులను విడతల వారీగా రూ.500 కోట్లు విడుదల చేసి పంచాయతీలకు అందించామని తెలిపారు. మున్సిపాలిటీకి ఇప్పటికే రూ.15 కోట్ల నిధులు కేటాయించామని, అవసరమైన మేర మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

“పల్లా ఓ మాయగాడు… దొంగ ఓట్ల స్పెషలిస్టు!”

ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ కోసం 1300 మంది అమరవీరులు ప్రాణాలు అర్పిస్తే, నీళ్లు–నిధులు–నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని మండిపడ్డారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్, చివరకు తన కుటుంబానికే పదవులు పంచుకున్నారని ఆరోపించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ పటిష్టంగా ఉన్నాయని, కానీ కేసీఆర్ లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం నేడు “కూలేశ్వరం”గా మారిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ జబర్దస్త్ యాక్టర్ అని, దొంగ ఓట్లతో, దొంగ దారుల్లో మ్యాజిక్‌లు చేసే మాయగాడని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో పల్లాకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కష్టపడి ప్రజల మధ్య నుంచి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, అమెరికా నుంచి వచ్చి సిరిసిల్ల సీటు దక్కించుకున్న నేత కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతానికి రావాల్సిన సాగునీటిని సిద్ధిపేటకు మళ్లించి రైతులను మోసం చేసిన వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు అని ఆరోపించారు.

అప్పుల రాష్ట్రంగా మారిన తెలంగాణ

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని చామల మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే చేర్యాల పట్టణానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. చేర్యాల ప్రజలు ఈసారి ఆలోచించి ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పట్టణాభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.