epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నువ్వు అంత మోగొనివా..!

నువ్వు అంత మోగొనివా..!
నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావా?
ఏయ్ సీఐ.. నిన్ను వ‌దిలిపెట్ట‌ను
పోలీసులపై సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ జగ్గారెడ్డి బూతు పురాణం

కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందంటూ కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం, చివరకు పోలీసులతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీసింది. సమాచారం అందుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి హుటాహుటిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ శివకుమార్ వ్యవహారశైలిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో పోలీసు అధికారులపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. పోలింగ్ కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జగ్గారెడ్డి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. పరిస్థితి అదుపు తప్పి కొద్దిసేపు తోపులాటకు దారి తీసింది. డీఎస్పీ సత్తయ్య గౌడ్ సహా ఇతర పోలీసు సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

పోలింగ్ కేంద్రంలో హైడ్రామా

పోలింగ్ కేంద్రం వద్ద జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంబంధిత సీఐ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. “పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అధికార పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారు” అంటూ విమర్శించారు. వెంటనే సంబంధిత సీఐను సస్పెండ్ చేయాలని, లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అలాగే 34వ వార్డులో జరుగుతున్న పోలింగ్‌ను తక్షణమే రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.

చట్టపరమైన చర్యలకు సన్నాహాలు

ఇదిలా ఉండగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిబ్రవరి 10న సదాశివపేటలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలపై జగ్గారెడ్డిపై ఇప్పటికే కేసు నమోదైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తాజాగా పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటి ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులపై దురుసు ప్రవర్తన, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి నివేదిక కోరినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. అదనపు బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.