epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హుజురాబాద్‌పై కాంగ్రెస్ జెండా

హుజురాబాద్‌పై కాంగ్రెస్ జెండా

దశాబ్దాల తర్వాత వ‌రించిన విజ‌యం

చైర్‌ప‌ర్స‌న్‌గా సుహాసిని, వైస్ చైర్‌ప‌ర్స‌న్‌గా అంజలి

అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రణవ్ వ్యూహాలకు ఫలితం

సమన్వయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక పాత్ర

స‌మావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్‌

కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఎన్నోఏళ్ల తర్వాత పట్టణ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో ఆపార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన నాటి నుంచే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వ్యూహాలు ఫలించాయి. “ఈసారి ఏదైనా చేసి హుజురాబాద్‌లో జెండా ఎగరవేయాలి” అన్న పట్టుదలతో ముందుకెళ్లిన కాంగ్రెస్ చివరకు లక్ష్యాన్ని సాధించింది.
సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం చైర్‌ప‌ర్స‌న్‌గా రోంటాల సుహాసిని, వైస్ చైర్మన్‌గా గూడూరి అంజలి ఎన్నికయ్యారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రణవ్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గెలిచిన సభ్యులను ఘనంగా సన్మానించారు. మీడియాతో మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి వరుస విజయాలు దక్కుతున్నాయని అన్నారు. ఇకపై హుజురాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారని, పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు తెచ్చి మరింత పురోగతి సాధిస్తామని తెలిపారు. ఇంతటి మెజారిటీతో ఆశీర్వదించిన హుజురాబాద్, జమ్మికుంట ప్రజలకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రణవ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రద్దుకు బీఆర్ఎస్‌ డిమాండ్

హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఓట్లను తారుమారు చేశారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను బయటకు తీసుకురావడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని బీఆర్ఎస్ కౌన్సిలర్ గందె శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పలు వార్డుల్లో గెలవాల్సిన తమ అభ్యర్థులు అన్యాయంగా ఓటమి పాలయ్యారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు చైర్‌పర్సన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియను నిరసిస్తూ సభ నుంచి గందె శ్రీనివాస్, వర్దినేని రవీందర్రావు, కేసిరెడ్డి లావణ్య, బండ సింధుజ, బండ నరేష్, సమ్మరీన్, ప్రతాప తార, ప్రతాప మంజుల వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాకౌట్‌తో మున్సిపల్ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.