epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విదేశీ ఉన్నత విద్యపై అవగాహన

విదేశీ ఉన్నత విద్యపై అవగాహన
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ
నైపుణ్యాభివృద్ధిపై నిపుణుల మార్గదర్శనం
అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు

కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఐఈఎల్టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం) విదేశీ ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం ప్రోత్సాహంతో బీసీ స్టడీ సర్కిల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఫోరం, ప్లేస్‌మెంట్ సెల్, టీఎస్‌కేఎస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అనిత అబ్రహం మాట్లాడుతూ… ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమర్థవంతమైన భావవ్యక్తీకరణ నైపుణ్యాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఐ ఈ ఎల్ టి ఎస్ వంటి శిక్షణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని తమ భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కమల క్రిస్టియాన అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను సాధించాలంటే భాషా ప్రావీణ్యంతో పాటు సమగ్ర నైపుణ్యాలు అవసరమని వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ పి. కృష్ణ దయాసాగర్ హాజరై మాట్లాడారు. రిసోర్స్ పర్సన్స్ ఇర్ఫాన్ ఖాన్, సమిరన్ రాయ్‌లు ఐ ఈ ఎల్ టి ఎస్ పరీక్ష ఉద్దేశ్యం, ప్రాముఖ్యత, విదేశీ ఉన్నత విద్య సాధించే విధానాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ శోభారాణి, డాక్టర్ శ్రీలత, కళాశాల ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ ఎం.ఎం. లక్ష్మి మాట్లాడుతూ… వారం రోజుల పాటు జరుగనున్న శిక్షణలో విద్యార్థులు పాల్గొని అంతర్జాతీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు మహమ్మద్ అన్వర్, స్వర్ణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.