epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గత ఏడాది ఫలితాలను మళ్లీ సాధించాలి

గత ఏడాది ఫలితాలను మళ్లీ సాధించాలి
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
45 కేంద్రాల్లో 8,154 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం
పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు
మ‌హ‌బూబాబాద్ డీఈఓ రాజేశ్వర్

కాకతీయ, మహబూబాబాద్ ప్ర‌తినిధి : జిల్లాలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి. రాజేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సిఎస్‌లు, డివోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఏడాది సాధించిన ఉత్తీర్ణత శాతాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేలా కృషి చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 8,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, శుభ్రత, విద్యుత్ సదుపాయం, సీసీ కెమెరాలు, టాయిలెట్లు, డ్యూయల్ బెంచీలు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

భద్రతా చర్యలు కట్టుదిట్టం.. సెక్షన్ 144 అమలు

ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత, సీలింగ్ ప్రక్రియలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు జిరాక్స్ కేంద్రాలను పూర్తిగా మూసివేయనున్నట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పరీక్షల నిర్వహణలో పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులకు టైమ్‌టేబుల్‌పై పూర్తి అవగాహన కల్పించాలని, ఎవరూ పరీక్షలకు గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, డీఎస్ఓ అప్పారావు, డిసిఇబి కార్యదర్శి బాలాజీ, మండల విద్యాశాఖ అధికారులు, సిఎస్‌లు, డివోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.