epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇక పాఠశాలల్లో పప్పులుడకవ్

ఇక పాఠశాలల్లో పప్పులుడకవ్
నిధులు విధులపై ప్యానల్ టీం పర్యవేక్షణ
భద్రాద్రి జిల్లాకు 48 మంది ఉపాధ్యాయుల ఎంపిక
ప్రాథమిక స్థాయి నైపుణ్యాల పెంపు దిశగా కీలక చర్యలు
హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అనంతరం పర్యవేక్షణ బాధ్యతలు
మూడు నెలల్లో వంద పాఠశాలల పనితీరుపై సమగ్ర పరిశీలన
హాజరు, నిధుల వినియోగం, బోధన విధానాలపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త చర్యలు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో నిధుల వినియోగం, బోధన విధానాలు, ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై సమగ్ర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్యానల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించి నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించనున్నాయి. విద్యార్థుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బోధన విధానాలను మెరుగుపరచడం, నాణ్యమైన విద్య అందించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

భద్రాద్రి జిల్లాకు 48 మంది ఉపాధ్యాయుల ఎంపిక

ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొత్తం 48 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరిలో ఎస్జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు ఉండగా, ప్రత్యేక బృందాలుగా నియమించి పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అందించగా, అనంతరం జిల్లా వ్యాప్తంగా వారికి కేటాయించిన పాఠశాలలను పరిశీలించనున్నారు. ప్రతి బృందంలో ఒకరు నోడల్ అధికారిగా, ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తూ పర్యవేక్షణ నిర్వహించనున్నారు.

పాఠశాలల పనితీరుపై సమగ్ర పరిశీలన

ప్రత్యేక బృందాలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పనితీరును సమగ్రంగా పరిశీలించనున్నాయి. మూడు నెలల వ్యవధిలో సుమారు 100 పాఠశాలలను తనిఖీ చేసి బోధన విధానం, నిధుల వినియోగం, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై నివేదికలను సిద్ధం చేయనున్నారు. విద్యార్థుల ప్రగతిని పెంపొందించే విధంగా కృత్యాధార బోధన అమలు, బోధనా సామగ్రి వినియోగం, తరగతుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించనున్నారు. అవసరమైన చోట ఉపాధ్యాయులకు సూచనలు అందించి విద్యా ప్రమాణాల పెంపుకు మార్గనిర్దేశం చేయనున్నారు.

ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక నిఘా

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, విధుల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానంతో పాటు, ఆకస్మిక తనిఖీల ద్వారా విధులకు గైర్హాజరు అయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాలల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్యానల్ బృందాల పర్యవేక్షణ కీలకంగా మారనుంది. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడి విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.