epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ముందస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

ముందస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
‘అరైవ్ అలైవ్’ ప్రచారంలో కమిషనర్ సునీల్ దత్ సందేశం
విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
పొగమంచు, చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తల సూచనలు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. ప్రమాదాల్లో గాయపడిన బాధితులు తమ అనుభవాలను పంచుకోవడంతో కార్యక్రమం భావోద్వేగభరితంగా మారింది. కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించగలమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటుబెల్ట్ పెట్టుకోకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్‌ఫోన్ వినియోగం, సిగ్నల్ జంప్, ఓవర్‌లోడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను విడిచిపెట్టాలని సూచించారు. తెలంగాణను రోడ్డు భద్రతలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమన్నారు.

పొగమంచులో డ్రైవింగ్‌కు కీలక సూచనలు

చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా దృష్టి మందగిస్తుందని పేర్కొంటూ, డ్రైవర్లు ముందుగానే ప్రయాణం ప్రారంభించాలి, అతివేగం, ఓవర్‌టేకింగ్ నివారించాలి, లో-బీమ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలి, సురక్షిత దూరం పాటించాలన్నారు. నిర్దేశిత లేన్లలోనే నడపడం, కిటికీ అద్దాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇండికేటర్లను ముందుగా వినియోగించడం, సడన్ బ్రేకింగ్ నివారించడం అత్యవసరమని తెలిపారు. పొగమంచు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే సురక్షిత ప్రదేశంలో వాహనం ఆపి పరిస్థితి స్పష్టమైన తర్వాత ప్రయాణం కొనసాగించాలని సూచించారు. తెలంగాణ పోలీసు శాఖ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీటీవో జగదీశ్, ఏసీపీలు తిరుపతి రెడ్డి, రమణమూర్తి, శ్రీనివాసులు, కళాశాల చైర్మన్ నవీన్, సీఐలు మురళి, రాజు, సంజీవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.