epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్”
పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..!
కాలువ మాయం… అధికారుల మౌనం
ప్రభుత్వ భూమిపై యథేచ్ఛగా నిర్మాణం
వరద ముప్పుపై స్థానికుల ఆందోళన
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
తక్షణ చర్యలకు ప్రజల డిమాండ్

కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ భూముల రక్షణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణం మధ్యలో ఉన్న నాలాను పూర్తిగా ఆక్రమించి అక్కడే “జనతా బార్” నిర్వహిస్తున్న సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది. కాలువ ఆనవాళ్లే మాయం చేసి నిర్మాణం చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. బీ.వై. నగర్ పరిధిలోని రాయిన్ చెరువు పరిసరాల్లో ఈ అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. చెరువుకు అనుబంధంగా ఉన్న కాలువలను క్రమంగా ఆక్రమించుకుంటూ వస్తున్న పరిస్థితిలో, ఓ వ్యక్తి పూర్తిగా నాలా స్థలాన్నే కబ్జా చేసి బార్ నిర్మించడం మరింత వివాదాస్పదంగా మారింది. స్థానికుల ప్రకారం కాలువను పూర్తిగా పూడ్చి, దాని ఆనవాళ్లను కూడా చెరిపేసి నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

  క‌బ్జా త‌ర్వాత కాలువ నిర్మాణం మాయ‌మైన దృశ్యం

కాలువలే మాయం… ప్రమాద సంకేతాలు

సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై గోపాల్ నగర్ ప్రాంతంలో ఈ కబ్జా జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పట్టణ అభివృద్ధికి కీలకమైన డ్రైనేజ్ వ్యవస్థను ధ్వంసం చేయడం వల్ల భవిష్యత్తులో వరద ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కాలువలు, నాలాలు సహజంగా నీటి పారుదల కోసం అవసరమైనవి. అవి లేకపోతే వర్షాకాలంలో నీరు నిల్వై ముంపు సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆక్రమణలు పట్టణ భద్రతకే ముప్పుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణం రోజుకో అడుగు ముందుకేసి పూర్తి దశకు చేరుకున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇంత పెద్ద స్థాయిలో నిర్మాణం జరుగుతున్నా అధికారులు ఎలా గమనించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతి ఇచ్చారు..? లేదా అనుమతి లేకుండానే ఎలా కొనసాగింది..? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం లేదా మౌన సహకారం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క‌బ్జాకు ముందు కాలువ నిర్మాణం ఉన్న దృశ్యం

ప్రభుత్వ ఆస్తుల రక్షణ ఎక్కడ..?

పట్టణంలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నా వాటిని రక్షించాల్సిన యంత్రాంగం స్పందించకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ప్రజల అవసరాల కోసం ఉంచిన వనరులు అక్రమాలకు గురవడం అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణను తొలగించి, కాలువలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. నాలాలోనే బార్ నిర్మాణం ఘటన పట్టణ పాలనపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారా… లేక ఈ వ్యవహారం కూడా కాలగర్భంలో కలిసిపోతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.