ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
కాకతీయ, కరీంనగర్ : మండలంలోని మధురానగర్ గ్రామంలో మహిళ ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దూస లత (45) తన నివాసంలోనే ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే గంగాధర ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గత ఏడాది కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. గురువారం ఉదయం గది తలుపు తెరవకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన భర్త శంకరయ్య తలుపులు పగులగొట్టి చూడగా కిటికీకి ఉన్న వైర్‌తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

