“అంబేద్కర్ ఆశయ సాధనతో దేశాభివృద్ధి సాధ్యం”
•జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, మంచిర్యాల : రాజ్యాంగ నిర్మాత, సమానత్వ సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనతో దేశాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ 175 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐ.బి చౌరస్తాలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, వివిధ బి.సి సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డి.సి.పి ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, ఇన్చార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, వివిధ బిసి సంఘాల నాయకులతో కలిసి హాజరై కేక్ కట్ చేశారు.

