epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద

కాకతీయ, చెన్నూరు : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందోని, అందులో భాగంగానే అన్నదాతలు పండించిన వరి ధాన్యంలో ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. అక్కడ జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను, తూకాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి
ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేకానంద మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, త్వరితగతిన రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తోందని తెలిపారు. గతంలో ప్రతి సంవత్సరం ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల ధాన్యం వచ్చేదని, కానీ ఈసారి రైతులకు 28 నుండి 32 క్వింటాళ్ల వరకు రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. చెన్నూర్, కోటపల్లి పరిసర ప్రాంతాలలో ఈసారి పంట కొద్దిగా ఆలస్యంగా చేతికి వస్తున్నందున, జూన్ 15వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను నిరంతరాయంగా నిర్వహిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.

నియోజకవర్గంలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం
గతంలో 2022-23 లో 1 లక్ష 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈసారి ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1 లక్ష 27 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి వివరించారు. జూన్ 6వ తేదీ నాటికి మరో 30 వేల నుండి 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని, మొత్తంగా ఈ సీజన్‌లో దాదాపు 1 లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

వర్షాల ముందే కొనుగోళ్లు పూర్తి: కలెక్టర్ కుమార్ దీపక్
అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 70 శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. జైపూర్ మండలంలో వచ్చే 3 రోజులలో కొనుగోళ్లు పూర్తిగా ముగుస్తాయన్నారు. వచ్చే నెల 7వ తేదీ నుండి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున, అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం కలగకుండా పెద్దపల్లి, కరీంనగర్‌లలో హమాలీ వసతితో కూడిన 2 గోదాములను సిద్ధం చేశామన్నారు. అలాగే జైపూర్ మండలంలోని సుముఖ గోదాములోకి చెన్నూర్ నుండి వచ్చే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. చెన్నూర్, కోటపల్లి మండలాలకు సంబంధించి మిగిలిన ధాన్యం ప్రక్రియను రాబోయే 15 రోజులలో పూర్తి చేసే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఇంటి నిర్మాణ అనుమతికి రూ.13వేల లంచం డిమాండ్‌ రూ.20...

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,...

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత కాకతీయ,...

పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం

పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం కాంగ్రెస్ రామకృష్ణాపూర్ పట్టణ అధ్య‌క్షుడు  వోడ్నాల కాకతీయ, రామకృష్ణాపూర్...

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యాచరణ అక్రమ కేసులు...

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం చెన్నూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు రహదారి...

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం బెల్లంపల్లి,...

తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్ నిబంధనల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.