ఘనంగా వరల్డ్ ఆర్ట్ డే వేడుకలు
ఆర్టిస్టుల ప్రతిభకు ప్రశంసలు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్ట్ డే వేడుకలు బుధవారం సాయంత్రం పట్టణంలోని రఘు ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ గౌడ్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటికి కనిపించే అందాలను కుంచెతో అందమైన చిత్రాలుగా మలిచే ఆర్టిస్టుల ప్రతిభ అభినందనీయమని పేర్కొన్నారు. సంగీతం, గానం వంటి కళలు ప్రజలకు ఆనందాన్ని పంచుతాయని తెలిపారు. సీనియర్ ఆర్టిస్ట్ శిల్పా భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడు లియోనార్డో డావించీ చిత్రించిన ‘మోనాలిసా’ అత్యంత విలువైన పెయింటింగ్‌గా గుర్తింపు పొందిందన్నారు. డావించీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న వరల్డ్ ఆర్ట్ డే జరుపుకోవడం గర్వకారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు భువనేశ్వర్ (శ్రీరామ్ ఆర్ట్స్), సీనియర్ ఆర్టిస్టులు వీరస్వామి (సిటీ ఆర్ట్స్), డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు ఆర్ట్స్), బ్రహ్మం (బ్రహ్మాస్), సంతోష్ (సంతు ఆర్ట్స్), సాయినాథ్ (మెర్సీ ఆర్ట్స్), కమల్ విశ్వ (కమల్ ఆర్ట్స్), సంపత్ చందు తదితరులు పాల్గొన్నారు.

