epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేడో.. రేపో?

నేడో.. రేపో?

అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు !

రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే ప్ర‌క‌ట‌న‌?

రెండు మూడు రోజుల్లోనే బీసీ కులాల సమాఖ్య‌ల‌కు చైర్మ‌న్లు!

పాలక మండళ్లకు సంబంధించిన పోస్టులు కూడా భర్తీ

ప‌ద‌వులు ఎవ‌రిని వ‌రిస్తాయోన‌ని ఆశావ‌హుల్లో ఉత్కంఠ‌

కార్పొరేష‌న్ చైర్మ‌న్ల ప‌ద‌వీకాలం త్వ‌ర‌లో పూర్తి

స‌రిగా ప‌నిచేయ‌ని వారి స్థానంలో కొత్త వాళ్ల‌కు ఛాన్స్‌?

నాయ‌కుల్లో మ‌ళ్లీ చిగురిస్తున్న ఆశ‌లు

ఈసారి మ‌హిళ‌ల‌కు అధిక ప్రాతినిధ్యం..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: పార్టీ కోసం అంకిత‌భావంతో ప‌నిచేస్తున్న నాయ‌కుల‌కు వెంట‌నే నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వాల‌ని రాష్ట్ర కాంగ్రెస్ పెద్ద‌లు నిర్ణ‌యించ‌డంతో ప‌ద‌వులు ఎవ‌రిని వ‌రిస్తాయోన‌ని ఆశావ‌హుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ పోస్టుల‌తోపాటు కార్పొరేషన్ చైర్మ‌న్లు, పాలక మండళ్లకు సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించ‌డంతో నాయ‌కుల్లో మ‌ళ్లీ ఆశ‌లు చిగురిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానుండ‌టంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి నాయిబ్రాహ్మణ, పద్మశాలి, రజక తదితర కులాలకు చెందిన కార్పొరేషన్లలోని పోస్టులనే భర్తీ చేయనున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో సీఎం బుధవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో దాదాపు నాలుగు గంటలపాటు వారు పలు అంశాలపై చర్చించారు. ఈభేటీలోనే టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజర్ల పోస్టుల భర్తీపై కూడా చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. మండల, బూత్‌ లెవల్‌ కమిటీల ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

‘ఒక్కరికి కేవలం ఒక పదవే…’

కాగా కార్పొరేషన్లతోపాటు పార్టీ పదవులను భర్తీ చేసేటప్పుడు క్రియాశీలకంగా ఉన్న జిల్లాలు, అక్కడి సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం పనిచేసిన నేతలు తదితరాంశాలపై జాబితాను రూపొందించాలంటూ సీఎం సూచించారు. ‘ఒక్కరికి కేవలం ఒక పదవే…’ అనే సూత్రాన్ని పక్కాగా, తూ.చా. తప్పకుండా పాటించాలంటూ కోరారు. ఇదే విధంగా భవిష్యత్‌ అవసరలను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమీకరణాలు, పొందికలపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే కార్పొరేషన్‌ చైర్మెన్లు, ప్రభుత్వ సలహాదారుల పోస్టుల కోసం వందలాది మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఆ జాబితాను సాధ్యమైనంతగా వడబోసి, పార్టీకి విధేయులుగా ఉండి, ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుకోసం పని చేసి, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించాలని భావిస్తున్నారు. వారిలోంచి మొదటి దఫాగా 20 నుంచి 25 మందికి పదవులను కట్టబెట్టాలని నిర్ణయించిన‌ట్లు స‌మాచారం. ఇదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు ప్రాధాన్యతనిస్తూనే రెడ్డి సామాజిక తరగతిని కూడా ‘సంతృప్తి’ పరిచే విధంగా జాబితాలను సిద్ధం చేయాలని సీఎం… పీసీసీ చీఫ్‌కు విజ్ఞప్తి చేసిన‌ట్లు తెలిసింది. కాగా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల్లో కనీసం 30 శాతం మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

దాదాపు 60 కార్పొరేషన్ పదవులు..

ఇప్పటికే పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల చైర్మన్ పదవులు భర్తీ పూర్తయింది. ఇంకా మిగిలిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కొన్ని అనుబంధ విభాగాల చైర్మన్ల నియామకం మిగిలి ఉంది. ఈ విషయాలను మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్‌లు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కసరత్తు చేసిన వివరాలను పరిశీలించి తక్షణమే కమిటీ కూర్పును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కులాలకు సంబంధించిన దాదాపు 15 ఫెడరేషన్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా దాదాపు 60 కార్పొరేషన్ పదవులు, మహిళా కమిషన్ పదవులను కూడా భర్తీ చేయాలని వీరు నిర్ణయించారు.

సీఎంతో మీనాక్షి, మహేశ్​ కుమార్ భేటీ..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పీసీసీ రాష్ట్ర నాయకత్వం చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లు భేటీ అయ్యారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది.తాజా రాజకీయ పరిణామాల నుంచి పీసీసీ పూర్తిస్థాయి కమిటీ కూర్పు వరకు అనేక అంశాలపై వీరి మధ్య అంశాల వారీగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ పూర్తిస్థాయి కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.