మోదీ హఠావో కిసాన్‌కో బచావో
యూత్ కాంగ్రెస్ మహాధర్నాకు భారీగా తరలిరండి
కాంగ్రెస్ వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కొరివి పరమేష్ పిలుపు
కాకతీయ,నర్సంపేట టౌన్ : రైతుల సమస్యల పరిష్కారం కోసం యూత్ కాంగ్రెస్ చేపడుతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ పటేల్ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ, అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు నిర్వహించిన కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్షలు విజయవంతంగా కొనసాగాయని తెలిపారు. దీక్షలకు మద్దతు తెలిపిన ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు నర్సంపేట నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని కోరారు. .ఈ సందర్భంగా తుమ్మలపెల్లి సందీప్ మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి యువత పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, మండల అధ్యక్షులు బొంత రంజిత్, పూరుషోత్తం సురేష్, ఉపాధ్యక్షులు ములుకల మనీష్, మహమ్మద్ సల్మాన్, నాయకులు వనపర్తి శోభన్ కుమార్, లక్క విజేందర్, తడుగుల ప్రవీణ్, కొత్తగట్టు ప్రశాంత్, ఈశ్వర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

