హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
సమితి అధ్యక్షుడు పేరం గోపికృష్ణ పిలుపు
కాకతీయ, హన్మకొండ : ఈనెల 25వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు హన్మకొండలోని దాసాంజనేయస్వామి దేవాలయం వేదికగా నిర్వహించనున్న హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సమితి అధ్యక్షుడు పేరం గోపికృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పెద్దఎత్తున భక్తులు, యువత పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నందగిరి సంతోష్ శర్మ, కందికొండ రాజు, చిర్ర ప్రవీణ్, సుతారి కృష్ణ, గుంటి శ్యామ్, చీకటి సతీష్, దేవేంద్ర చారి, కలవచర్ల వీరాచారి, చంద్రమౌళి, కనుకుంట్ల వెంకటేశ్వర్లు, నీరటి రాజు, కంచర్ల అరుణ్, నాగరాజు, శ్రావణ్, క్రాంతి, శ్రీను మరియు పోచమ్మకుంట బస్తీ పెద్దలు పాల్గొన్నారు.

