టాస్క్ జాబ్ మేళాలో 62 మందికి ఉద్యోగాలు
380 మందిలో 62 మంది ఎంపిక… 9 మంది షార్ట్‌లిస్ట్
కాకతీయ, పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్‌లో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ మేళా ద్వారా 62 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక కాగా, మరో 9 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో మొత్తం 380 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. జీపీఈలో 14 మంది, ఏజే సొల్యూషన్స్‌లో 16 మంది, వైఎస్కేలో 26 మంది, ఎయిర్టెల్‌లో 6 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాగే వర్కస్‌లో 4 మంది, ఎయిర్టెల్‌లో 5 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఇలాంటి జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, సెంటర్ ఇంచార్జి కౌసల్య, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్స్, వివిధ కళాశాలల ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

