epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దు

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దు
5 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలి
బకాయిలు ఉన్న 500 మందిపై కఠిన చర్యలకు నిర్ణయం
జీడ‌బ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి
30 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు ఆదేశం

కాకతీయ, వరంగల్: ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడాలని, కనీసం 30 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు అంకితభావంతో కృషి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి స్పష్టం చేశారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో 5 శాతం పన్ను రాయితీ పథకంపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5 శాతం రాయితీ సదుపాయం మరో 8 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సువర్ణావకాశంపై క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. సకాలంలో పన్ను చెల్లించడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక లాభం కలుగుతుందని, ఆ నిధులతో నగర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

వసూళ్ల పురోగతిని సమీక్షించిన కమిషనర్ చాహత్ బాజ్‌పాయి, ఇప్పటివరకు కేవలం 8 శాతం మాత్రమే పన్ను వసూలు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. వసూళ్లలో వెనుకబడిన ఆర్‌ఐలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపరచుకోవాలని హెచ్చరించారు. సమావేశానికి గైరుహాజరైన వార్డు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రికవరీ చట్టం ప్రయోగం: అత్యధిక బకాయిలు ఉన్న మొదటి 500 మంది పన్ను చెల్లింపుదారులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను వసూళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన యంత్రాలు, వాహనాలను కేటాయించనున్నట్లు వెల్లడించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోని సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, సమ్మయ్య, ప్రసన్నారాణి, తహసీల్దార్ రామకృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.