epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్ర‌ముఖ నిర్మాత‌ త్రిపురనేని చిట్టిబాబు క‌న్నుమూత‌

ప్ర‌ముఖ నిర్మాత‌ త్రిపురనేని చిట్టిబాబు క‌న్నుమూత‌

గుండెపోటుతో ద‌వాఖాన‌లో తుదిశ్వాస

ద‌ర్శ‌కుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా గుర్తింపు

49 చిత్రాలకు కో-డైరెక్టర్‌గా బాధ్య‌త‌లు

ఆయన అసలు పేరు వరప్రసాద్

త్రిపురనేని మహారథి కుమారుడిగా ఇండ‌స్ట్రీకి..

చిట్టిబాబు ఆకస్మిక మరణంపై చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. మంగ‌ళ‌వారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైటెక్ సిటీ కొండాపూర్‌ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ చిట్టిబాబు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. చిట్టిబాబు ఆకస్మిక మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
‘అల్లూరి సీతారామరాజు’ రచయిత, ప్రముఖ నిర్మాత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. ఆయన అసలు పేరు వరప్రసాద్. 1955 జూలై 28న కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. తండ్రి ముద్దుగా పిలిచుకునే ‘చిట్టి’ పేరుతోనే అందరికీ సుపపరిచితుడయ్యారు. సినిమాల మీద ఆసక్తితో తండ్రి బాటలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆత్రేయ, అప్పలాచార్య దగ్గర రచనశాఖలో అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత 1984లో ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నా పేరు దుర్గస‌, ప్రళ‌యం’, ‘ప్రేమించి చూడు’, ‘రైతు భారతం’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

సౌంద‌ర్య‌ను ప‌రిచ‌యం చేసింది చిట్టిబాబే..

త్రిపురనేని చిట్టిబాబు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. 49 చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేశారు. ‘గరుడాచలం’, ‘భైరవ ద్వీపం’, ‘దశావతారం’ ‘జాతిరత్నాలు’, ‘జాంబీరెడ్డి’, ‘దర్జా’, ‘జిన్నా’ వంటి 30కి పైగా సినిమాల్లో నటించారు. అలానే నిర్మాతగానూ కొన్ని సినిమాలు రూపొందించారు. దివంగత నటి సౌందర్యని ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిట్టిబాబే. ఆయన దర్శకత్వంలో కృష్ణ, భాను చందర్, వాణీ విశ్వనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సౌందర్యని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ దీని కంటే ముందు ఆమె నటించిన ‘మనవరాలి పెళ్లి’ సినిమా రిలీజయింది. ఇదే సౌందర్య డెబ్యూ మూవీగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత చిట్టిబాబు దర్శకత్వంలో సౌందర్య ‘గెలుపు’ అనే సినిమా చేశారు. ఎమ్మెస్ నారాయణని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా చిట్టిబాబే. తనను డైరెక్టర్ ని చేసింది మంచు మోహన్ బాబు అని చిట్టిబాబు పలు సందర్భాల్లో చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.