epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాదండ్ల భాస్క‌ర్‌రావు క‌న్నుమూత‌

నాదండ్ల భాస్క‌ర్‌రావు క‌న్నుమూత‌

అనారోగ్యంతో తుది శ్వాస

20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స

ఎమ్మెల్యే, ఎంపీగా కీల‌క బాధ్య‌త‌లు

ఉమ్మ‌డి ఏపీలో ముఖ్యమంత్రిగా రికార్డు

కేవ‌లం 31 రోజులపాటు ప‌ద‌విలో..

రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం పదవిలో ఉన్న సీఎం..

నేడు పంజాగుట్ట‌లో అంత్య‌క్రియ‌లు

నాదెండ్ల మృతిపట్ల పలువురు నేతల దిగ్భ్రాంతి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కరరావు వృద్దాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్‌రావు 1935 జూన్‌ 23లో గుంటూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు పనిచేశారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు 31 రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 31 రోజుల పాటు సీఎం పీఠంపై కూర్చున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే ‘ఆగస్టు సంక్షోభం’లో అతను కీలక పాత్రధారి. అప్పట్లో ఎన్టీఆర్ వెన్నంటే ఉండి, ఆపై ఆయనకే సవాల్ విసిరిన వైనం నేటికీ చర్చనీయాంశమే.

రాజకీయాల్లో కీలక పాత్ర

1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాల్లో కీలక శాఖలను నిర్వహించారు. 1982లో నందమూరి తారక రామారావు ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించినప్పుడు భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. 1983 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించాక, ఎన్టీఆర్​ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్ మద్దతుతో సీఎం..

ఎన్టీఆర్ టెక్సాస్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి వచ్చిన వేళ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. కాంగ్రెస్ మద్దతుతో 1984 ఆగస్టు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా నెల రోజులకే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1998లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. 2019లో ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా నాదెండ్ల మనోహర్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా, ఆయన పార్థివ దేహాన్ని జూబిలీహిల్స్ లోని వారి స్వగృహం వద్ద ఉంచనున్నారు. గురువారం మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.