epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతుల పేరుతో డ్రామాలు ఆపాలి

రైతుల పేరుతో డ్రామాలు ఆపాలి

ప్రతిపక్షాల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమే

అసత్య ప్రచారాలు నమ్మవద్దు

మార్కేట్ ఛైర్మన్ రావుల హరీష్ రెడ్డి

కాకతీయ, నెక్కొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమై వాస్తవాలకు దూరమని నెక్కొండ మండల కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం నెక్కొండలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లావుడ్యా తిరుమల్ చౌహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కెట్ చైర్మన్ రావుల హరిష్ రెడ్డి, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మార్కెట్ చైర్మన్ రావుల హరిష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులకు రైతుల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే తమ పదేళ్ల పాలనలోనే పరిష్కారాలు చూపాల్సిందని మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ, మొక్కజొన్న రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే మరో రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లావుడ్యా తిరుమల్ చౌహన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ రైతులకు శాశ్వత పరిష్కారాలు చూపడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల పేరుతో ప్రచారం ఎక్కువ చేసి, రైతులను మాత్రం రోజుల తరబడి నిరీక్షింపజేసిందన్నారు. తూకంలో ఆలస్యం, చెల్లింపుల్లో జాప్యం, మధ్యవర్తుల దోపిడీ వంటి సమస్యలను పరిష్కరించలేక రైతులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకొని కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రతిపక్ష నేతలు ధర్నాల పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం మానుకొని, గతంలో రైతులకు చేసిన అన్యాయాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు విరమించుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి రైతుల పక్షాన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల పెంపు, మద్దతు ధర కల్పన, చెల్లింపుల వేగవంతంపై ఇప్పటికే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, మొక్కజొన్న రైతులకు పూర్తి న్యాయం జరిగేలా కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, కొనిజేటి బిక్షపతి, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయి కృష్ణ, కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, భూక్య రమేష్, మార్కెట్ డైరెక్టర్లు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.