కార్మికుల శ్రమతోనే ప్రపంచ ప్రగతి
మే డే వేడుకల్లో రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ
ఘనంగా భగీరథ కార్మిక సంఘం ఉత్సవాలు
కాకతీయ, హన్మకొండ: కార్మికుల కఠోర శ్రమపైనే ప్రపంచ ప్రగతి ఆధారపడి ఉంటుందని రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండలోని 54వ డివిజన్ పరిధి హనుమాన్ నగర్‌లో భగీరథ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపికృష్ణ జెండాను ఆవిష్కరించి కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో ప్రతి శ్రమజీవి పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో కార్మికులు వెన్నెముకగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భగీరథ కార్మిక సంఘం ప్రతినిధులు, స్థానిక కార్మికులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

